సుమన్‌తేజ్, అనుశ్రీ జంటగా నటిస్తున్న ‘వశిష్ట’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీశ్ చావా దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాల సురేష్ కుమార్ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే మైథలాజికల్ సోషల్ డ్రామా ఇది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నాం. ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కుదిరారు’ అన్నారు. వినూత్నమైన కథతో ఈ సినిమా తీస్తున్నామని నిర్మాత నోరి నాగప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ గరిమెళ్ల, సంగీతం: షేక్మీర్ వలీ, రచన-దర్శకత్వం: హరీశ్ చావా.