Suman | ఒకప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న సుమన్ తనకంటూ తిరుగులేని ఇమేజ్ అందిపుచ్చుకున్నాడు. ఆయన సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పటి వారికి సుమన్ క్రేజ్ పెద్దగా తెలియకపోవచ్చు కాని, , 1990ల్లో సుమన్ క్రేజ్ వేరే లెవల్ అని చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల కంటే ముందుగానే సుమన్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్, కృష్ణ,. అక్కినేనిల తర్వాత సుమన్‌కే విపరీతమైన క్రేజ్ దక్కింది. ఆయనలో మల్టీ టాలెంటెడ్ ఉండడంతో దర్శక నిర్మాతలు సుమన్‌తో సినిమాలు చేసేందుకు పోటీలు పడేవారు.
కష్టాలలో కూరుకుపోయిన సుమన్‌కి మరో లైఫ్ ఇచ్చిన సూపర్ స్టార్ ఎవరో తెలుసా?
అయితే సుమన్ క్రమంగా స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో కొన్ని వివాదాలు అతని జీవితాన్ని కుదిపేశాయి. అనంతరం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సుమన్ . సుమన్ ఎదుర్కొన్న కేసుల గురించి జనాలలో అనేక రకాలుగా చర్చ సాగింది. అయితే సుమన్ కెరీర్ మరింత దిగజరఆరుతున్న సమయంలో ఓ స్టార్ హీరో నిర్ణయం వలన ఆయన కెరీర్ మళ్లీ పరుగులు పెట్టింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన అన్నమయ్య మూవీలో శ్రీవారి పాత్ర కోసం మొదట శోభన్ బాబుని సంప్రదించగా, ఆయన అప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ సమయంలో కింగ్ నాగ్, రాఘవేంద్రరావు కలిసి సుమన్ పేరుని ప్రస్తావించారు.
అప్పుడు వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ పూర్తిగా ఒదిగిపోయాడు. అసలు సినిమాలో నాగ్ తర్వాత అంతలా ప్రాణం పోసింది అంటే సుమన్ అని చెప్పక తప్పదు. ఆ సినిమా తర్వాత సుమన్‌కి వరుసగా బలమైన పాత్రలు, దేవుళ్ల పాత్రలు రావడం జరిగింది.ఇక సుమన్ ఇప్పటికీ మంచి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నారు. అయితే శోభన్ బాబు వల్ల సుమన్‌కి సినిమాల్లో సెకండ్ లైఫ్ వచ్చింది అని చెప్పాలి. ఆయన కనుక నో చెప్పక పోయి ఉంటే ఈ రోజు సుమన్ పరిస్థితి ఎలా ఉండేదో మరి.