బుల్లితెర యాంకర్ సుమ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంట్లో జరిగే సరదా సరదా విషయాలతో పాటు ప్రస్తుత పరిస్థితులలో ఎలా నడుచుకోవాలో కూడా తెలియజేస్తుంది. తాజాగా ఓ వీడియో ద్వారా కళాకారుల ఆవేదనను తెలియజేసింది. ముందుగా ఈ వీడియోని లైట్ తీసుకోండని చెప్పిన సుమ, మేకప్ కిట్ని తీసి తమ మొహానికి మేకప్ వేసుకుంటూ చాలా రోజులైంది కదా, పని చేస్తున్నాయో లేదో అని తెలుసుకునేందుకు వేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.
మాకు జీవనాధారం, పొట్ట నింపేది ఇండస్ట్రీ. ఇంత అన్నం దొరకాలంటూ అంతా పని చేయాలి. యాక్టర్స్, యాంకర్స్, డైరెక్టర్స్, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్, జిమ్మి, లైట్ మెన్, ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్, మేకప్ మెన్, హెయిర్ స్టైలీష్ట్, ఆర్ట్, ఫుడ్, ప్రొడక్షన్ ఇలా అందరూ సెట్స్ మీదకు రావాలి. మేమంతా మా పనులను ప్రారంభించాలి.. కుటుంబాలను పోషించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. త్వరలోనే మళ్లీ పనులు సక్రమంగా జరుగుతాయని ఆశిస్తున్నాను అని సుమ పేర్కొంది.
…fight masters, editors, make-up, hairstylist, art, food, production and so on need to be on set, who r now eagerly waiting to get back to work to feed their respective families. Looking forward for everyone to start working again in my industry soon. #SumaKanakala #tv #movies
— Suma Kanakala (@ItsSumaKanakala) May 27, 2021