Sultan of Delhi | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిలన్ లుథ్రియా (Milan Luthria) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ది డర్టీ పిక్చర్ (The Dirty Picture), వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి (Once Upon A time in Mumbai), టాక్సీ నెం. 9211 (2006) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను బాలీవుడ్‌కు అందించాడు. ఇక తాజాగా మిలన్ లుథ్రియా చేస్తున్న వెబ్ సిరీస్ సుల్తాన్ అఫ్ ఢిల్లీ(Sultan of Delhi). హాట్‌స్టార్ స్పెషల్స్ (Hotstar Specials) నుంచి వస్తున్న ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటి మౌని రాయ్ (Mouni roy), తాహిర్ రాజ్ భాసిన్ (Tahir Raj Bhasin), అంజుమ్ శర్మ (Anjum Sharma) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్, ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సిరీస్ 1962 ఢిల్లీలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
Jab Dilli ke raaz aur Sultan ke mijaaz milenge, toh dhamal toh machega hi. 📷 #HotstarSpecials #SultanOfDelhi – All episodes streaming now.#SultanOfDelhiOnHotstar#TahirRajBhasin @Roymouni @an_3jum #nishantdahhiya @1harleensethi @anupriyagoenka @pathakvinay pic.twitter.com/ntW6uko5xn
— Disney+ Hotstar (@DisneyPlusHS) October 13, 2023
ప్రముఖ ఇండియన్ రచయిత అర్నాబ్ రే రచించిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: అసెన్షన్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించగా.. అంజుమ్ శర్మ, నిశాంత్ దహియా, వినయ్ పాఠక్, అనుప్రియ గోయెంకా, మెహ్రీన్ పిర్జాదా, హర్లీన్ సేథి తదితరులు కీలక పాత్రలు పోషించారు.