Pushpa The Rule | టాలీవుడ్‌తోపాటు గ్లోబల్ ఇండస్ట్రీ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో తెరకెక్కిన పుష్ప.. ది రైజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో మరోసారి ట్రెండ్ సెట్ చేసేందుకు వస్తున్నాడు అల్లు అర్జున్.
నేడు సాయంత్రం 4 :05 గంటలకు బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది.. రూలింగ్ ఫ్రమ్ బాక్సాఫీస్.. అని ట్వీట్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ టీం. ఇంతకీ ఆ ప్రకటన ఏంటని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. సీక్వెల్లో ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని, అవి విజువల్ ట్రీట్ ఇస్తూ.. గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన టాక్. అల్లు అర్జున్-ఫహద్ ఫాసిల్ మధ్య వచ్చే నాలుగు యాక్షన్ సన్నివేశాలు, జగపతిబాబుతో వచ్చే ఒక యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతున్నాయట.
సీక్వెల్ కోసం సుకుమార్-బన్నీ టీం ఇరగదీసే కొత్త హుక్ స్టెప్స్ కూడా రెడీ చేసిందని ఇండస్ట్రీ సర్కిల్ టాక్. పార్ట్ 1కు అదిరిపోయే పాటలను అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఉండబోతుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఫస్ట్ పార్టును మించిన బడ్జెట్‌తో సీక్వెల్‌ను తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా నటించిన కన్నడ సోయగం రష్మిక మందన్నా రెండో పార్టులో కూడా సందడి చేయబోతుంది.
పుష్ప ది రూల్ అనౌన్స్మెంట్..
THE BIGGEST ANNOUNCEMENT IS ON ITS WAY 🔥🔥
Ruling box office from……………… 💥#Pushpa2TheRule update today at 4.05 PM ❤🔥❤🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023