Sukumar | టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా సుకుమార్ పేరు వినిపిస్తుంది. ఆయనని లెక్కల మాస్టారు అని, క్రియేటివ్ జీనియస్ అని అభిమానులు పలు రకాలుగా పిలుచుకుంటారు. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన సుకుమార్ ఇటీవల పుష్ప2 చిత్రం వరల్డ్ వైడ్‌గా సరికొత్త రికార్డులు నమోదు చేశారు. ఇప్పుడు సుకుమార్ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. అయితే సుకుమార్ త్వరలో రామ్ చరణ్‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాతో ఉండగా, ఈ లోపు చిన్న ప్రాజెక్ట్ ఏదైన చేస్తాడా లేకుంటే ఈ గ్యాప్‌లో రామ్ చరణ్ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్లాన్ చేసుకుంటున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
తాజాగా సుకుమార్ తమిళనాట జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. పుష్ప సినిమాలో హీరో పాత్ర ఓ రియల్ స్మగ్లర్ నుంచి స్పూర్తి పొంది డిజైన్ చేసినట్లు ఈ సందర్భంగా సుకుమార్ స్పష్టం చేశారు. తాను ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఓ వెబ్ సిరీస్ తీయాలనుకున్నప్పుడు పుష్పరాజ్ అనే ఓ స్మగ్లర్‌ను కలిశానని.. అతడి పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటంతో అతడిని ఇంటర్వ్యూ కూడా చేశానని అన్నారు. అయితే పుష్ప అనే పేరు ఆడవారికి పెడతారు కాని ఓ స్మగ్లర్ ఇలాంటి పేరుతో ఉండడం తనను అట్రాక్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. పుష్ప అనే ఓ స్మగ్లర్ కారణంగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిందని ఆయన ఇప్పుడు రివీల్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
పుష్ప లాంటి ఊర మాస్ సబ్జెక్ట్‌తో తమిళంలో సినిమా చేస్తే ఎవరితో చేస్తారని సుకుమార్‌ని ప్రశ్నించగా, దానికి ఏమాత్రం ఆలోచించకుండా కార్తీతో చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పేశారట సుకుమార్. కార్తీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా తనకి ఇష్టమని కితాబు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా సూర్య కూడా తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చారు సుకుమార్. సూర్య, కార్తీ తో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలే వదలుకోనని సుకుమార్ చెప్పడంతో కోలీవుడ్ సినిమా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారట. ఇక పుష్ప చిత్రానికి సంబంధించి మూడో పార్ట్ కూడా ఉంటుందని సుకుమార్ గతంలోనే వెల్లడించారు. మరి ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.