Sriranga neethulu | టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం శ్రీరంగనీతులు (Sriranga neethulu). యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించగా.. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11 విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖు ఓటీటీ వేదికలు అమెజాన్ ప్రైమ్ వీడియో(Prime Video)తో పాటు, ఆహా(AHA)లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.
Thrills, romance, and mystery 🔥 “#SrirangaNeethulu” delivers a captivating story full of surprises and heartfelt moments on @ahavideoIN & @PrimeVideoIN@ActorSuhas @KarthikRathnam3@iRuhaniSharma @viraj_ashwin @bhavanidvd @BhavaniHDMovies @Teju_PRO pic.twitter.com/zdUmKiOUjv
— BA Raju’s Team (@baraju_SuperHit) May 30, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అంథాలజీ రూపంలో వచ్చిన ఈ చిత్రం మొదటి కథలో శివ(సుహాస్) అంబర్‌పేట్‌లో ఉన్న ఓ చిన్న బస్తీలో సామ్ సంగ్ టెక్నీషియన్‌గా పని చేస్తుంటాడు. అయితే బస్తీలో ఉండే యూత్‌లో అందరికంటే తానే గొప్పగా ఉండాలని అనుకుంటాడు. ఈ కారణంతోనే ఆ ఏరియాలో ఉన్న ఓ రాజకీయ నాయకుడితో ఫొటోలు దిగి బతుకమ్మ పండుగ రోజు పెద్ద బ్యానర్ కట్టిస్తాడు. అయితే ఈ బ్యానర్ తెల్లవారే సరికి అక్కడ కనిపించదు. దాన్ని వేరే గ్యాంగ్ చించేస్తారు. దీంతో ఆ గ్యాంగ్‌తో గొడవ పెట్టుకుంటాడు శివ. రెండో కథలో ఇందు(రుహాణి శర్మ), వరుణ్ (విరాజ్ అశ్విన్).. చాలా రోజులుగా ప్రేమించుకుంటారు. ఇదే విషయాన్ని తమ ఇంట్లో చెప్పడానికి ఇందు చాలా భయపడుతుంది. అదే సమయంలో ఇందుకు ఇంట్లో పెళ్లి సంబంధం ఓకే అవుతుంది. అయితే అంతలోనే ఇందుకు తాను ప్రెగ్నెంట్ అని అనుమానం వస్తుంది. దీంతో ఈ విషయాన్ని ఇంట్లో చెప్పుకోలేక.. అటు వరుణ్‌తో వెళ్లిపోలేక వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది.
మూడో కథలో కార్తీక్(కార్తీక్ రత్నం) లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. మందు, సిగరెట్, గంజాయికి బాగా అలవాటు పడి ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుకుంటాడు. కార్తీక్‌ను మార్చడానికి అతడి తండ్రి ఎంతగానో ట్రై చేస్తాడు. కానీ అతడు మారడు. అయితే అనుకోకుండా ఒకరోజు కార్తీక్ రూమ్‌లోకి వచ్చిన అతడి తమ్ముడు గంజాయి మొక్కలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుతుంది. అయితే అతడిని పట్టుకోవడానికి పోలీసుల అతడి ఇంటికి వెళ్లగా.. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. అయితే శివ మళ్లీ బ్యానర్ వేయించాడా?.. ఫ్లెక్సీ చించేసిన గ్యాంగ్‌ను శివ ఏం చేశాడు.? ఇందు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందా? కార్తీక్ పోలీసులకు దొరికాడా? కార్తీక్ మళ్లీ మాములు మనిషిగా మారాడా లేదా అనేది తెలియాలంటే ‘శ్రీరంగనీతులు’ సినిమా చూడాల్సిందే.