కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్లో మంచి గర్తింపు సాధించారు నటుడు సుహాస్. తాజాగా ఆయన మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేశారు. గోపీ ఆచార ఈ చిత్రానికి దర్శకుడు. సుహాస్తో ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాన్ని తెరకెక్కించిన షణ్మఖ ప్రశాంత్ కథ అందిస్తున్నారు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఆద్యంతం వినోదభరిత ప్రయాణంలా ఈ సినిమా ఉంటుందని, ఇందులో సుహాస్ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారని, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలైలో మొదలుకానుందని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా రూపొందనున్నది.