Sriranga Neethulu | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు యువ హీరో సుహాస్. కలర్‌ఫొటోతో హీరోగా సూపర్ బ్రేక్ అందుకున్న సుహాస్ (Suhas) ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ కుర్ర హీరో మరోవైపు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band) సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే మరో సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చేశాడు సుహాస్.
ఈ యాక్టర్ నటిస్తోన్న మరో చిత్రం శ్రీరంగనీతులు (Sriranga Neethulu). ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను లాంఛ్ చేశారు. కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. రుహాణీ శర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వెంకటేశ్వర్ బల్మూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.
ఇక దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ మ్యారేజ్ బ్యాండ్ టీం స్టోరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రాబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తో చెప్పాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
సుహాస్ ఈ సినిమాతోపాటు ఇప్పటికే ఆనందరావ్ అడ్వంచర్స్ (Anandrao Adventures) అనే టైటిల్‌తో మరో సినిమా కూడా లాంఛ్ చేశాడు. రామ్ పసుపులేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
🥁Unveiling The Title Poster Of #SriRangaNeethulu 🙌
⭐Ing @ActorSuhas @KarthikRathnam3 @iRuhaniSharma @viraj_ashwin
💰#VenkateshwaraRaoBalmuri
✍️&🎬 #PraveenKumarVSSIn Theatres Soon ❤️🔥
@Siddhu_Pro@PRDuddiSreenu pic.twitter.com/Vu5vntlWGe
— Ramesh Bala (@rameshlaus) May 15, 2023