సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గోట్’. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
నిర్మాత మాట్లాడుతూ ‘వినోదాత్మక మాస్ ఎంటర్టైనర్గా చిత్రం రూపొందుతోంది. రెండు షెడ్యూల్స్‌తో పాటు, రెండు పాటలను పూర్తిచేశాం. సుడిగాలి సుధీర్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. లియోన్ జేమ్స్ పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. సుధీర్ కెరీర్లో మైల్‌స్టోన్‌గా చిత్రం నిలుస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి డీఓపీ: బాలాజీ సుబ్రమణ్యం, ఎడిటర్:కె.విజయవర్ధన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి.