Sudigali Sudheer | బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్‌తో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్. ఈ క్రేజ్‌తో సుధీర్ హీరోగా కూడా చేస్తున్నాడు. అయితే హీరోగా సుధీర్‌కి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తిరిగి బుల్లితెరపై పలు షోలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ చేస్తున్న ఓ రియాలిటీ షో మంచి స్పందన దక్కించుకుంటుంది. అయితే తాజా ఎపిసోడ్‌కి అప్పటి అందాల హీరోయిన్ రంభ చీఫ్ గెస్ట్‌గా వచ్చింది. దాంతో సుడిగాలి సుధీర్ సరదాగా కామెడీ స్కిట్ చేశారు. బావగారు బాగున్నారా సినిమాలోని ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఐకానిక్ టెంపుల్ సీన్‌ని రీ క్రియేట్ చేయగా, ఇది చాలా మందికి వినోదం పంచింది.
బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తూ ఉంటే రంభ కనిపిస్తుంది. ఇప్పుడు షోలో కూడా సుధీర్ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తూ ఉన్న సమయంలో రంభ కనిపిస్తుంది. నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే శివుడు కనిపించాలి కానీ రంభ కనిపించడం ఏంటి అంటూ కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయట. కొన్ని హిందూ సంఘాలు కూడా దీనిపై సీరియస్ అయ్యాయట. సుధీర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని, ఇలాంటివి హిందువుల మనోభావాలను దెబ్బ తీయడం అవుతుందని, కామెడీ కోసం ఇలా చేయడం అనేది కచ్చితంగా కరెక్ట్ కాదు. సుధీర్‌తో పాటు షో నిర్వాహకులు కూడా వెంటనే క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే చిరంజీవి చేస్తే ఎవరు ఏమనలేదు. ఇందులో కొత్తగా కూడా ఏం చేయలేదు, కానీ అప్పుడు లేని వివాదం ఇప్పుడు ఏంటి అంటూ కొందరు సుధీర్‌ను సపోర్ట్ చేస్తున్నారు. చిరంజీవి చేస్తే పర్వాలేదు కాని ఏదో కామెడీ కోసం సుధీర్ ఇలా చేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైన సుడిగాలి సుధీర్ అలాంటి ఒక వివాదంలో చిక్కుకుని పెద్ద తలనొప్పిని ఎదుర్కొంటున్నాడు. మరి దీనికి ఎలా పులిస్టాప్ పడుతుందో చూడాలి.