G.O.A.T | సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer), దివ్య భారతి (Divyabharathi) హీరోహీరోయిన్లుగా పాగల్ ఫేమ్ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఎస్ఎస్4 (SS4). ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం సుధీర్ బర్త్ డే సందర్బంగా టైటిల్ ఫస్ట్ లుక్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్స్ పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి G.O.A.T : Greatest Of All Times (ట్యాగ్‌లైన్) టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రోజు సుడిగాలి సుధీర్ బర్త్ డే రోజున మా “GOAT” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాకు తగ్గట్టే లియోన్ జేమ్స్ మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు. మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.
దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ… ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా షూటింగ్ విషయంలో మాకు ఏది కావాలన్నా బడ్జెట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లియోన్ జేమ్స్ మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
Here’s the Title Poster of Hero @sudheeranand‘s next
“G.O.A.T – Greatest of All time” 💥Wishing him a very Happy Birthday #GOATTheMovie 𓃵
🎬 @NaresshLee
💃@divyabarti2801
🎹 @leon_james
💰@MahatejaC @luckymediaoff#HBDSudigaliSudheer ⭐️
More updates soon. pic.twitter.com/aTNUME4nxB— Mahaateja Creations (@MahatejaC) May 19, 2023
నటీనటులు:
సుధీర్, దివ్య భారతి తదితరులు
సాంకేతిక నిపుణులు :
డైరెక్టర్ : నరేష్ కుప్పిలి
ప్రొడ్యూసర్స్ – చంద్రశేఖర్ రెడ్డి మొగుల్ల,
బెక్కెం వేణుగోపాల్
మ్యూజిక్ – లియోన్ జేమ్స్
డి. ఓ. పి – బాలాజీ సుబ్రహ్మణ్యం
ఎడిటర్ – కె విజయవర్ధన్
ఆర్ట్ – రాజీవ్ నాయర్
రచయిత – ఫణికృష్ణ సిరికి
కో-డైరెక్టర్ – శ్రీకాంత్ కోల
అసోసియేట్ డైరెక్టర్ – బబ్లు
ప్రొడక్షన్ కంట్రోలర్ – రాంబాబు
బుద్దాల
ప్రొడక్షన్ మేనేజర్స్ – ప్రభాకర్ రాజు, గోవిందు దనాల
కాస్ట్యూమ్ డిజైనర్- శ్రీహిత
పి.ఆర్.ఓ – ఏలూరు శ్రీను, మధు
పబ్లిసిటీ డిజైనర్ -శివ