Pawan kalyan | పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం వేగంగా సినిమాలను ఒకే చేస్తూ అంతే వేగంగా షూటింగ్‌లను కూడా పూర్తిచేస్తున్నాడు. అటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అందులో రెండు సెట్స్ పైన ఉండగా, మిగితావి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో యువ దర్శకుడు ఈయనతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘స్వామిరారా’, ‘కేశవ’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు సుధీర్ వర్మ. ఈయన పవన్‌తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడున్న కమిట్మెంట్లను పూర్తి చేయడానికే చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో సుధీర్‌వర్మకు ఓకే చెప్పాడా లేదా అనేది చూడాలి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సుధీర్ వర్మ, రవితేజతో రావణాసుర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనితో పాటు ‘శాకినీ ఢాకినీ’ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.