Ajith 62 | తమిళ స్టార్ అజిత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలై మంచి విజయాలను సాధిస్తుంటాయి. లేటెస్ట్ ఈయన ‘వలిమై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహంచాడు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించింది. పోటీగా ‘భీమ్లానాయక్’ ఉండటంతో ఈ చిత్రం బ్రేక్ఈవెన్కు దగ్గరగా వచ్చి ఆగింది. అజిత్ తన తదుపరి సినిమాను కూడా హెచ్.వినోద్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది సెట్స్ పైన ఉండగానే అజిత్ తన 62సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అజిత్ తన 62వ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి అనురుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుభాస్కరణ్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజిగా ఉన్న ఈ చిత్ర షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి.. వచ్చే ఏడాది ద్వితియార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.