Sudheer Babu | సుధీర్‌బాబు నటించనున్న తాజా చిత్రానికి ‘జటాధర’ అనే టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది మహాశివరాత్రి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు శివన్ నారంగ్, ప్రేరణా అరోరా, ఉజ్వల్ ఆనంద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. చేతిలో త్రిశూలంతో పవర్‌ఫుల్‌గా సుధీర్‌బాబు ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. సూపర్ న్యాచురల్ ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే కథాంశమిదని, ఈ కథకు ‘జటాధర’ టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ అని చిత్ర దర్శకుడు వెంకట్ కల్యాణ్ తెలిపారు. ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, టాప్ టెక్నీషియన్స్ పని చేయనున్నారని, త్వరలో షూటింగ్ మొదలుపెడతామని మేకర్స్ తెలిపారు.