Sudheer babu New Look | బోలెడంత టాలెంట్, చక్కటి రూపం, మహేష్‌బాబు వంటి స్టార్ సపోర్ట్ ఉన్నా సుధీర్ బాబు కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి వినూత్న సినిమాలు చేస్తున్నా ఎందుకో సుధీర్‌కు రావాల్సిన గుర్తింపు రావడం లేదు. ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుధీర్.. ఈ క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రతీ సినిమాకు తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టైమ్ బాలేకో, అదృష్టం లేకో సుధీర్ సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి. ఈ ఏడాది రిలీజైన హంట్ సుధీర్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో సుధీర్‌బాబు ఒకరు. కండలు తిరిగినదేహంతో ఎప్పుడూ స్టైలిష్ లుక్‌లో కనిపించే సుధీర్.. తాజాగా లడ్డుబాబు అవతారమెత్తాడు. లావుగా, చబ్బీ చీక్స్‌తో సుధీర్‌బాబుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం ఆయన ప్రముఖ కమెడియన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో మామా మశ్చింద్రా సినిమా చేస్తున్నాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో భాగంగానే సుధీర్ లావు అవతారమెత్తినట్లు తెలుస్తుంది. ఏదైమైనా ఎప్పుడు సిక్స్‌ప్యాక్‌తో బెస్ట్ బాడీతో కనిపించే సుధీర్ ఒక్కసారిగా లావుగా కనిపించే సరికి అందరూ షాక్ అవుతున్నారు.
Here is a leaked clip of @isudheerbabu from #MaamaMascheendra.
I love Sudheer Babu’s passion to try different things. He looks fabulous as an obese man in this clip! 👏
Which is your fav obese character? Mine is #NuttyProfessor pic.twitter.com/HnZBx33Yui
— idlebrain jeevi (@idlebrainjeevi) February 27, 2023