Hunt Movie Teaser Date | టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఫలితంతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలై యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘హంట్’ ఒకటి. మహేష్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సుధీర్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. ఇప్పటికే చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి.
కాగా ఈ సినిమా టీజర్‌ను గత బుధవారమే విడుదల చేయాల్సి ఉంది. అయితే మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో టీజర్‌ను పోస్ట్ పోన్ చేశారు. కాగా తాజాగా చిత్రబృందం కొత్త డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా టీజర్‌ను సోమవారం ఉదయం 11.06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Read Also:
NTR30 | జూ.ఎన్టీఆర్‌కు జోడీగా ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు?
Dasara Movie | ఐదు భాషల్లో విడుదల కానున్న ‘దసరా’ ఫస్ట్ సింగిల్
God Father Movie | ‘గాడ్‌ఫాదర్-2’ తెరకెక్కనుందా.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
బాక్సాఫీస్ దగ్గర ‘పొన్నియన్ సెల్వన్’ ప్రభంజనం.. తమిళ సినీ చరిత్రలోనే మొదటిసారి..!