సుధీర్‌బాబు కథానాయకుడిగా ప్రతిష్టాత్మక పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం రూపొందనున్నది. ఆర్.ఎస్.నాయుడు ఈ చిత్రానికి దర్శకుడు. ఆదివారం సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ తాజా సినిమాకు సంబంధించిన ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందనున్నదని వారు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో సుధీర్‌బాబు షర్ట్ లేకుండా, కండలు తిరిగిన దేహంతో.. ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. మెట్లపై మృతదేహాలు పడివుండగా.. సుధీర్‌బాబు ఆయుధంతో నడుచుకుంటూ వెళ్తూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ‘A Broken Soul On A Brutal Celebration’ అనే ట్యాగ్‌లైన్ ఇందులోని సుధీర్‌బాబు క్యారెక్టర్ డెప్త్‌ని తెలియజేస్తున్నది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్.