Jatadhara Teaser | టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’ (Jatadhara). ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ (Venkat Kalyan & Abhishek Jaiswal) సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. వెంకట్ కళ్యాణ్ కథనందిస్తున్నాడు. తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే మైథాలాజికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సోనాక్షి శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.