Sudheer Babu About Mahesh Babu | టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు ‘హంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మహేష్ సురపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటి నుండే సుధీర్‌బాబు ప్రమోషన్లు స్టార్ట్ చేశాడు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా ఇంటర్వూ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు. తాజాగా సుధీర్, మహేష్ బాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. కుటుంబాన్ని, సిస్టర్స్‌ను మహేష్ బాబు చూసుకున్నట్లు ఎవరూ చూసుకోరు అని వెల్లడించాడు. అంతేకాకుండా కుటుంబం తర్వాతే ఏదైనా అనే విధంగా మహేష్ ఆలోచిస్తుంటాడని తెలిపాడు. సుధీర్‌బాబు, మహేష్‌కు బావ అవుతాడన్న విషయం అందరికి తెలిసిందే. గతేడాది మహేష్‌కు మర్చిపోలేని దెబ్బలు తగిలాయి. మహేష్ అన్న రమేష్‌బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇప్పుడిప్పుడే ఆ భాద నుండి కోలుకుంటున్నాడు. ఇక త్వరలోనే త్రివిక్రమ్‌తో సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు.
ఇక సుధీర్‌బాబు ప్రస్తుతం కమర్షియల్ హీరో గుర్తింపు కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ బిగెనుండి కథా బలమున్న సినిమాలు చేస్తున్నా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ హంట్ సినిమాపైనే ఉన్నాయి. హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.