Sudheer Babu | సుధీర్ బాబు ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది. ఈయన నటించిన ప్రేమ కథ చిత్రం, భలే మంచి రోజు లాంటి సినిమాలు మంచి విజయం కూడా సాధించాయి. వీటితో సుధీర్‌బాబుకు సపరేట్ మార్కెట్ కూడా ఏర్పడింది. కానీ ఈ వారం ఆయన నుంచి వస్తున్న మామ మశ్చీంద్ర సినిమా గురించి ట్రేడ్ వర్గాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు ఈ సినిమా వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకు ఐడియా లేదు. నటుడు, దర్శకుడు హర్షవర్ధన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో సుధీర్ బాబు ఫస్ట్ టైం త్రిపాత్రాభినయం చేశాడు. అయినా కూడా దీని మీద ఎందుకో పెద్దగా అంచనాలు లేవు.
హడావిడిగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం.. అప్పటికప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాలు చేయడంతో సినిమా వస్తున్నట్లు చాలామంది ఐడియా లేదు.
దానికి తోడు చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న సినిమా ఇది. అందుకే మామ మశ్చీంద్ర గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే తన సినిమా ప్రమోషన్స్‌లో ఎప్పుడు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు సుధీర్ బాబు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. సినిమాను ఎలాగైనా ప్రేక్షకులు చెంతకు తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన వరకు రోజు ఏదో ఒక ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తూనే ఉన్నాడు. ఇది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 6న మామ మశ్చీంద్రతో పాటు మరో ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి.
ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన మ్యాడ్ సినిమాపై ఈవారం అంచనాలు బాగానే ఉన్నాయి. కాలేజ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాగా వస్తున్న ఇందులో కామెడీ బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. దానికి తోడు పెయిడ్ ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. మరోవైపు మురళీధరన్ బయోపిక్ 800.. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాలు కూడా ఇదే వారం వస్తున్నాయి. వీటి మధ్య సుధీర్ బాబు సినిమా ఎంతవరకు నిలబడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్ ఎంత చేసుకున్నా కూడా ప్రేక్షకులకు ఆసక్తి లేకపోతే వర్కవుట్ అవ్వదు. మరి విడుదల తర్వాత అయినా సుధీర్ బాబు సినిమా ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి..!