సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘మా నాన్న సూపర్‌హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. సీఏఎం ఎంటైర్టెన్మెంట్స్తో కలిసి వి సెల్యులాయిడ్స్ పతాకంపై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు. ‘వేడుకలో ఉన్నది కాలం.. వేదిక ఈ కల్యాణం..’ అంటూ సాగే ఈ పాటను సనాపతి భరద్వాజ పాత్రుడు రాసిన ఈ పాటను జైకృష్ణ స్వరపరచగా ఐశ్వర్య దరూరి, బృందా, చైతు సత్సంగి, అఖిల్‌చంద్ర ఆలపించారు. సుధీర్‌బాబు, సాయిచంద్ పాత్రల అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ పాట సాగింది. సాహిత్యానికి తగ్గట్టే పాట ఆద్యంతం వేడుకలా ఉంది. ఆర్ణ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి.