Harom Hara | యువ కథానాయకుడు సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. విడుదల తేదీ కూడా ప్రకటించింది. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయనున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. ఇదిలావుంటే తాజాగా ట్రైలర్ వదిలింది చిత్రయూనిట్.
బలవంతుడికి ఆయుధం అవసరం అయితే.. బలహీనుడికి ఆయుధం అనేది బలం అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. టీచర్‌గా పనిచేస్తున్న సుధీర్ బాబు ఆర్థిక ఇబ్బందుల వల్ల గన్స్ తయారు చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన ఇబ్బందులు ఏంటి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా రానుంది.. ఈ మూవీలో మాళవిక, సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుధీర్‌బాబు కుప్పం యాసలో అలరించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్. సంగీతం చైతన్ భరద్వాజ్.