“జటాధర’ నా కెరీర్లో ది బెస్ట్ స్క్రిప్ట్. ఇప్పటివరకూ తెలుగు తెరపై ఇలాంటి పాత్ర ఏ హీరో చేయలేదు. ఘోస్ట్ హంటర్‌గా ఇందులో కనిపిస్తాను. కాకపోతే దెయ్యాలపై తనకు నమ్మకం ఉండదు. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ధనపిశాచి నేపథ్యాన్ని తీసుకొని డైరెక్టర్ వెంకట్, అభిషేక్ అద్భుతంగా సినిమా తీశారు. దైవం, దెయ్యం ఉన్నాయని నమ్మే వాళ్లకే కాదు, నమ్మని వాళ్లకు సైతం ఈ సినిమా నచ్చుతుంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి.
ఈ సినిమాకోసం శివతాండవం చేయడం గొప్ప అనుభూతి. అది శివుని దీవెనగా భావిస్తున్నా. సోనాక్షి పవర్ఫుల్ పాత్ర చేశారు. సాంకేతికంగా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. ఆయన హీరోగా రూపొందిన పాన్ ఇండియా సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. సోనాక్షి సిన్హా కీలక భూమిక పోషించారు. శిల్పా శిరోద్కర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ కలిసి దర్శకత్వం వహించారు.
ఉమేశ్‌కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హాల్, నిఖిల్ నందా నిర్మాతలు. ఈ నెల 7న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సుధీర్‌బాబు మాట్లాడారు. ఈ సినిమాను ప్రేమతో చేశామని, సుధీర్‌బాబు అద్భుతంగా నటించారని నటి శిల్పా శిరోద్కర్ చెప్పారు. ఇంకా నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ కూడా మాట్లాడారు. దర్శకులు శైలేష్ కొలను, యదువంశీ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.