సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కే3 కోటికొక్కడు’. శివ కార్తిక్ దర్శకుడు. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 16న విడుదలకానుంది. గురువారం ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘పాండమిక్ వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. సుదీప్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలున్న చిత్రమిది. ఎక్కువశాతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. నాలుగు పాటలు అద్భుతంగా ఉన్నాయి’ అన్నారు. ‘కన్నడంలో బ్లాక్బస్టర్ మూవీ ఇది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో ప్రత్యేకంగా పాటలు పాడించారు. ‘పటాకీ పోరీ’ అనే పాట బాగా వచ్చింది’ అని గాయకుడు సింహా తెలిపారు..