Vikranth Rona Movie OTT Record | ‘విక్రాంత్ రోణ’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కిచ్చా సుదీప్. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28న విడుదలై ఘన విజయం సాధించింది. సుదీప్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా విడుదలైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధించి డబుల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో ఇండియాని షేక్ చేసిన కన్నడ సినిమాగా ‘విక్రాంత్ రోణ’ నిలిచింది. ఇక ఇటీవలే ఈ మూవీ కన్నడ వెర్షన్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులను క్రియేట్ చేస్తుంది.
ఈ చిత్రం శుక్రవారం నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ-5’లో కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ చిత్రం కేవలం 24గంటల్లోనే 500 మిలియన్ల వ్యూస్‌ను సొంత చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ పోలీస్ అధికారిగా నటించాడు. ఈ చిత్రాన్ని షాలినీ ఆర్ట్స్, ఇన్వెనియో ఒరిజిన్ సంస్థలతో కలిసి సుదీప్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నిరూప్ భండారి, నీతా అశోక్ కీలకపాత్రల్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రత్యేక గీతంలో అలరించింది. కాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 16నుండి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.