Bhairavam Pre Release Success Celebrations | సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలై, విజయం సాధించిన తర్వాతే సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ, ఓ చిన్న సినిమా టీమ్ వినూత్నంగా తమ చిత్రం విడుదలకు ముందే విజయోత్సవాలను జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమానే ‘భైరవం'(Bhairavam). ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మే 30, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్టైన ‘గరుడన్’ చిత్రానికి ఇది రీమేక్‌గా వస్తుంది.
అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు ఉండగా.. ఇప్పటినుంచే సక్సెస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇటీవల ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించగా.. సినిమాను చూసిన డిస్ట్రిబ్యూటర్లు, కొందరు సినీ ప్రముఖుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో, సినిమా విజయం అవ్వడం పక్కా అని చిత్రబృందం భావించింది. దీంతో విడుదలకు ముందే హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుకలలో కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు దర్శకుడు విజయ్ కనకమేడల పాల్గోన్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#Bhairavam ఫస్ట్ కాపీ చూసి ప్రొడ్యూసర్ ను గాల్లోకి లేపేసిన #BellamkondaSreenivas .
సినిమా అద్భుతంగా వచ్చిందని టాక్..
కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతామని టీం నమ్మకంగా ఉంది#ManchuManoj #NaraRohith pic.twitter.com/ME7kibQT46— The Cult Cinema (@cultcinemafeed) May 27, 2025