Subham | ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై అగ్ర నటి సమంత నిర్మాతగా వ్యవహారించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించగా.. సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భీమిలీ(భీమునిపట్నం)కి చెందిన శ్రీను (హర్షిత్ మల్గిరెడ్డి) కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ను నడుపుతూ తన స్నేహితుల(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి)తో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే అతడికి డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) రూపంలో వ్యాపార పోటీ ఎదురవుతుంది. ఈలోగా బ్యాంక్‌లో పనిచేసే శ్రీవల్లి (శ్రియ కొంతం)తో శ్రీను పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లయిన అనంతరం కొత్త జీవితం మొదలుపెట్టిన శ్రీనుకు తొలి రాత్రే వింత అనుభవం ఎదురవుతుంది. టీవీలో ‘జన్మ జన్మాల బంధం’ సీరియల్ చూస్తున్నప్పుడు అతని భార్య శ్రీవల్లి వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. శ్రీను స్నేహితుల భార్యలకూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. రాత్రి 9 గంటలవగానే ఆత్మలు ఆవహించినట్టుగా ప్రవర్తిస్తూ, సీరియల్ ఆపేస్తే భర్తలపై దాడులకు దిగుతారు. సీరియల్ అయిపోయాక మళ్ళీ మామూలైపోతారు.
ఈ విషయం బయటపడితే పరువు పోతుందని భయపడిన ఆ ముగ్గురు స్నేహితులు మొదట ఎవరికీ చెప్పరు. కానీ, ఊళ్లో అందరి ఇళ్లలోనూ ఇదే జరుగుతోందని తెలిసి షాక్ అవుతారు. అయితే అసలు ‘జన్మ జన్మాల బంధం’ సీరియల్‌కీ, ఈ ఆత్మలకీ సంబంధం ఏమిటి? ఈ సమస్యలకు పరిష్కారం కోసం మాయ మాతాశ్రీ (సమంత)ని ఎందుకు ఆశ్రయిస్తారు. ఆత్మల నుండి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది ఈ సినిమా కథ.
This June 13th, katha aarambham on JioHotstar 💫
Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025