అగ్ర నటి సమంత నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం ‘శుభం’. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రధారులు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. ఈ హారర్ కామెడీ సినిమా మే 9న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను శనివారం మేకర్స్ విడుదల చేశారు.
‘జన్మ జన్మల బంధం..’ అంటూ సాగే ఈ పాటను క్లింటన్ సెరెజో స్వరపరిచారు. ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించిన ఎనర్జిటిక్ రీమిక్స్ అని మేకర్స్ చెబుతున్నారు. నిర్మాత సమంతతోపాటు ప్రధాన తారాగణమంతా ఈ పాటలో కనిపించారు. ఈ పాటలో సమంత అందరి దృష్టినీ ఆకట్టుకున్నది. హుషారైన బీట్తో ఈ పాట సాగింది. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్.