Jolly Bastian | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ కన్నడ ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) కన్నుమూశారు. బెంగుళూరులోని తన నివాసంలో గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచారు. ఆయన కన్నడలో ఫైట్ మాస్టర్‌గా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జాలీ బాస్టియన్ మరణ వార్తతో కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు.
జాలీ బాస్టియన్ కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలో 900లకుపైగా చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పని చేశారు. తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన `అన్నయ్య` చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా కృష్ణవంశీ నక్షత్రం మూవీకి పని చేశాడు.