లాక్డౌన్ కాలంలో వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలిచి రియల్ హీరో అయ్యారు సోనూసూద్
(sonu sood). ఎవరైనా తమకు కష్టం వచ్చిందని సోనూసూద్ దృష్టికి తీసుకొస్తే చాలు..తనకు చేతనైనంత సాయం చేస్తుంటారు సోనూసూద్. ఈ స్టార్ యాక్టర్ ఎప్పుడూ ఏదో ఒక సాయం చేసి వార్తల్లో నిలుస్తూ ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటారు. తాజాగా జార్ఖండ్ లోని ఓ విద్యార్థి సమస్యకు పరిష్కారం చూపించారు.
గొడ్డ జిల్లా(Godda School) లోని ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై అందులో చదువుతున్న ఓ విద్యార్థి రిపోర్టర్లా మారిపోయి..స్కూల్ అంతా తిరుగుతూ సమస్యలను వీడియో తీసి రిపోర్టింగ్ చేశాడు. ఈ వీడియోపై సోనూసూద్ స్పందిస్తూ..సర్పరాజ్ ఇక తన కొత్త స్కూల్ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. స్కూల్, హాస్టల్ అతడి కోసం ఎదురుచూస్తున్నాయి..అంటూ రీట్వీట్ చేశారు. ఇపుడీ వీడియో, ట్వీట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
सरफराज अगली रिपोर्टिंग अपने नए स्कूल से करना।
बस्ता बांध स्कूल और हॉस्टल तेरा इन्तज़ार कर रहें हैं। https://t.co/h43n9fcbYP— sonu sood (@SonuSood) August 23, 2022