Stree 2 Movie | బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘స్త్రీ’ (Stree). ఐదేళ్ల కిందట బాలీవుడ్లో వచ్చిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.180 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ‘స్త్రీ 2’ అంటూ సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.
రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమాకు కూడా అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీని ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. చందేరి ప్రజలను ఇబ్బందిపెట్టిన ‘స్త్రీ’ అనే దెయ్యం ఆ ఊరును విడిచిపెట్టి వెళుతుంది. దీంతో చందేరికి ఇక ఎటువంటి సమస్య లేదు అని ప్రజలు అంతా సంతోషంలో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలోనే ఆ గ్రామానికి తలలేని రాక్షసుడు ఏంట్రీ ఇస్తాడు. అతడు అడుగుపెట్టిన రోజు నుంచే గ్రామంలో మనుషులు మాయం అవుతుంటారు. ఈ క్రమంలోనే చందేరి ప్రజలు మమ్మల్ని కాపాడండి ‘స్త్రీ’ అనే దెయ్యంను వేడుకుంటారు. మరి స్త్రీ చందేరి ప్రజలను కాపాడడానికి వస్తుందా.. అసలు రాజ్ కుమార్ రావుకు, స్త్రీ అనే దెయ్యనికి సంబంధం ఏంటి, శ్రద్ధా కపూర్ ఎవరు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Also Read..