Kangana Ranaut: పానీపూరీ అమ్ముకోవాలా? శంకరాచార్యకు కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
Kangana Ranaut: జ్యోతిర్మఠ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. ఉద్దవ్‌ను మోసం చేశారని శంకరాచార్య పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయవేత్త పానీపూరి అమ్ముకోవాలా అని ఎంపీ కంగనా ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దేవ్ ఠాక్రాను మోసం చేశారని, ప్రస్తుత సీఎం షిండే వెన్నుపోటు పొడిచారని, హిందూ మతంలో మోసాన్ని పెద్ద పాపంగా పరిగణిస్తారని, మోసం చేసేవాడు హిందువు కాదు అని ఇటీవల జ్యోతిర్మఠ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) తప్పుపట్టారు. శివసేన నేత, సీఎం ఏకనాథ్ షిండేకు ఆమె మద్దతుగా నిలిచారు.
అవిముక్తేశ్వరానంద స్వామికి కౌంటర్ ఇచ్చిన ఎంపీ కంగనా.. రాజకీయాల్లో రాజకీయవేత్త రాజకీయం చేయకుంటే .. పానీ పురీ అమ్ముకుంటాడా అని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో కూటమిలు ఏర్పాటు చేయడం, పార్టీలో విభేదాలు రావడం ఇవన్నీ కామన్ అన్నారు. 1907, 1971లో కాంగ్రెస్ పార్టీలో చీలకలు వచ్చినట్లు ఆమె తెలిపారు. శంకరాచార్య తన మాటలను తప్పుగా వాడారని, ఒకవేళ రాజు దోచుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు అది దేశద్రోహం అవుతుందని మతం పేర్కొన్నట్లు ఆమె వెల్లడించారు. ఏక్నాథ్ షిండేను ద్రోహి అంటూ మనందరి మనోభావాలను శంకరాచార్య దెబ్బతీశారని కంగనా తెలిపారు.
అనుచిత అంశాలను వెల్లడిస్తూ హిందూ మత గౌరవాన్ని శంకరాచార్య కించపరుస్తున్నారని ఆమె అన్నారు. 2022 జూన్‌లో శివసేన(యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ సపోర్టుతో ఏకనాథ్ షిండే సీఎం అయ్యారు.
राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा?
शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

