తేజ సజ్జా టైటిల్ రోల్ పోషించిన ‘హను-మాన్’ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. తొలుత ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. తాజాగా మరాఠీ, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా ఉదయ్‌కృష్ణ పనిచేశారు.
ఉదయ్ ప్రస్తుతం ‘బీస్ట్ బెల్స్’ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పే పనుల్లో తలమునకలై ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హను-మాన్’ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం నాకు దక్కడం పూర్వజన్మ సుకృతం. భారతదేశ చిత్ర పరిశ్రమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటా. విజువల్ ఎఫెక్ట్స్‌ను వినియోగించుకోవడంలో విజనరీగా పేరున్న ఎస్ఎస్ రాజమౌళి తర్వాత అలాంటి విజన్ ఉన్న మరో దర్శకుడు ప్రశాంత్‌వర్మ. పతాక సన్నివేశాల్లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు నా విజువల్ ఎఫెక్ట్స్‌తో జీవం పోయడాన్ని అతిపెద్ద ఛాలెంజ్‌గా తీసుకున్నా. రెండేళ్లుగా నా జీవితంలో అంతర్భాగమైన ‘హను-మాన్’ విజయం నా కష్టాన్నంతా మర్చిపోయేలా చేసింది.