BADASS | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు నటుడు సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ. సితార బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రాలు కామెడీ హిట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమాల అనంతరం మళ్లీ నాగవంశీతో చేతులు కలిపాడు సిద్ధూ. వీరి కలయికలో రాబోతున్న తాజా చిత్రం బ్యాడాస్(BADASS). మధ్య వేలు పురుషుడిలా ఉంటే(If middle finger was a man) అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా, బబుల్గమ్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ సిగరెట్ పట్టుకుని రా లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
You have seen heroes
& You have seen villains. 😈
But this one’s not here to fit into your labels! 😎Make way for STARBOY #Siddu as #Badass ❤️🔥
This time no mercy. He’s going to set the screens on 🔥
A Film by @ravikanthperepu
Produced by @vamsi84 & #SaiSoujanya… pic.twitter.com/kUeVUYIEII— Sithara Entertainments (@SitharaEnts) July 9, 2025