Simran | స్టార్ సెలబ్రిటీల పిల్లలు నట వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇండస్ట్రీకి రావడం కొత్తేమీ కాదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు కొందరైతే.. సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనేవారు ఇంకొందరు. తాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే వారి జాబితాలో అలనాటి అందాల తార సిమ్రాన్ (Simran) కుమారుడు చేరబోతున్నాడన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
2003లో పెళ్లైన తర్వాత సిమ్రాన్ నటనకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే క్యారెక్టర్ రోల్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్ . తాజాగా సిమ్రాన్ పెద్ద కుమారుడు అధీప్ (Adheep) ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అధీప్ త్వరలోనే తమిళ్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అవుతున్నాడని ఇన్సైడ్ టాక్. మరి అధీప్ సోలో హీరోగా కనిపిస్తాడా..? సపోర్టింగ్ రోల్‌తో ఎంట్రీ ఇస్తాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. అధీప్ లుక్ చూసిన అభిమానులు సిమ్రాన్ కొడుకు హీరో అయ్యేంత పెద్దవాడయ్యాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు.
90స్లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది సిమ్రాన్. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, తమిళంలో కమల్‌హాసన్, మాధవన్‌తోపాటు పలువురు స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. దక్షిణాదిన సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సిమ్రాన్ క్రేజ్ కుమారుడు అధీప్కు ఎలా కలిసొస్తుందో చూడాలి మరి. చాలా మంది బాంబే హీరోయిన్లు స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత హోంటౌన్స్లో సెటిలైపోయారు. కానీ సౌత్‌లో సూపర్ స్టార్ డమ్ సంపాదించిన సిమ్రాన్ మాత్రం చెన్నైలో సెటిలైంది. సిమ్రాన్‌కు మరో కుమారుడు ఆదిత్ కూడా ఉన్నాడు.
SAINDHAV | సైంధవ్ షూటింగ్ అప్డేట్.. వెంకటేశ్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?