Miss శెట్టి మిస్టర్ Polishetty | టాలీవుడ్ భామ అనుష్కా శెట్టి (Anushka shetty), యువ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కాంబినేషన్లో వస్తున్న చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రం కోసం స్టార్ హీరో పాట పాడబోతున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరనే కదా మీ డౌటు. ఇంకెవరో కాదు ధనుష్. తెలుగు, తమిళ భాషల్లో రాబోయే ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ త్వరలోనే ధనుష్ చేత రికార్డింగ్ చేయించబోతున్నాడన్న టాక్ ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా నడుస్తోంది. టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ రీసెంట్గా సార్ చిత్రంలో వావాథి సాంగ్‌తో నెట్టింటిని షేక్ చేశాడు. అనుష్క సినిమాలో ధనుష్ పాట ఉండబోతుందన్న న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.
Miss శెట్టి మిస్టర్ Polishetty నుంచి ఇప్పటికే విడుదలైన నోనోనో (NoNoNo Lyrical Song) లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సహజ నటి జయసుధ అనుష్క తల్లి పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..
నోనోనో లిరికల్ సాంగ్..