తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ సూర్య (Suriya). గజినీ, సెవెన్త్ సెన్స్, ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు), జైభీమ్..ఇలా డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ మూవీ లవర్స్‌ను ఫిదా చేశాడు. ఇటీవలే సూరారై పోట్రు చిత్రానికి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.
దక్షిణాది సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా ఎదిగిన సూర్య తొలి సంపాదన గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాను యువకుడిగా ఉన్నపుడు ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినట్టు చెప్పాడు. 18 గంటల పనికి రూ.736 మొదటి జీతం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తనకు తెలియదన్నాడు సూర్య.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు శివ డైరెక్షన్లో మరో సినిమా కూడా చేస్తున్నాడు. దీంతోపాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీ రోల్ చేస్తున్నాడు సూర్య.