Allari Naresh | ‘రంభ ఊర్వశి మేనక’..రెండున్నర గంటలు నవ్విస్తుంది..! అల్లరి నరేష్
‘సినిమా జయాపజయాల కంటే నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కావొద్దని కోరుకుంటాను. గత కొంతకాలంగా సీరియస్ కథలతో సినిమాలు చేశా. ఈసారి మాత్రం ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు నవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘సినిమా జయాపజయాల కంటే నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కావొద్దని కోరుకుంటాను. గత కొంతకాలంగా సీరియస్ కథలతో సినిమాలు చేశా. ఈసారి మాత్రం ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు నవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం అల్లరి నరేష్ విలేకరులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
- సాధారణంగా సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఈ సినిమాలో రంభ, ఊర్వశి, మేనక స్వర్గం నుంచి భూలోకానికి వస్తారు. ఇందులో నేను కష్టపడకుండా హీరో అయిపోవాలని కలలుకనే వ్యక్తి పాత్రలో కనిపిస్తా. అతని జీవితంలోకి రంభ ఊర్వశి మేనకలు ప్రవేశిస్తే ఏం జరిగిందన్నదే ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం.
- ప్రేక్షకులు నా నుంచి కితకితలు, బెండు అప్పారావు వంటి ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమాల్ని మిస్ అవుతున్నారు. ఈ కథ విన్నప్పుడు వాటి తరహాలోనే మంచి సినిమా అవుతుందనిపించింది. నా బాడీలాంగ్వేజ్‌కు తగినట్లుగా దర్శకుడు కామెడీని డిజైన్ చేశారు. కుటుంబ సభ్యులందరూ చూసేలా సంపూర్ణ హాస్యంతో అలరిస్తుంది. వెన్నెల కిషోర్, శ్రీనివాస్‌రెడ్డి క్యారెక్టర్స్ హైలైట్‌గా నిలుస్తాయి. వెన్నెల కిషోర్ ఇంద్రుడు పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ఆయన ఇంగ్లీష్‌తో పాటు అప్పుడప్పుడు హిందీలో కూడా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే దేవుడికి అన్ని భాషలు వస్తాయని ఆయన ఫీలింగ్. అయితే పాత్ర కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.
- ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్షన్, సీరియస్ కథలతో సినిమాలొస్తున్నాయి. వీటి మధ్యలో ప్రేక్షకులు కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను కోరుకుంటున్నారు. ఇకపై నేను రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా చేయాలనుకుంటున్నా. ట్రైలర్లో చూపించిన ‘ఓజీ’ స్పూఫ్ చాలా వైరల్ అయింది. కథానుగుణంగానే ఈ స్పూఫ్సీన్ ఉంటుంది. ‘శంభో శివ శంభో’ సినిమా నుంచి మల్టీస్టారర్స్ చేస్తున్నా. మంచి కథలు వస్తే మల్టీస్టారర్స్ చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. మొన్నటివరకు సీరియస్ సినిమాలు చేశాను. ‘రంభ ఊర్వశి మేనక’ మాత్రం ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘ఆల్కహాల్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మరో సినిమా ‘కనకదుర్గ’చిత్రీకరణ జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

