న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ దూకుడు పెంచింది. దేశీయ మార్కెట్లో రెండో స్థానం దక్కించుకోవాలని చూస్తున్న సంస్థ అందుకుతగ్గట్టుగానే తన ప్రణాళికను వేగవంతం చేసింది. రెండు కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయడంతోపాటు ఈవీ మాడల్‌ను తీసుకురానున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో తరుణ్ గార్గ్ వెల్లడించారు.
దీంతోపాటు దేశీయంగా వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుత పండుగ సీజన్లోన నూతన మధ్యస్థాయి ఎస్యూవీ మాడల్తోపాటు ఎలక్ట్రిక్ ఎస్యూవీ మాడల్‌ను కూడా దేశీయ మార్కెట్లోకి తీసుకోస్తున్నట్టు ఆటోమోటివ్ కంపొనెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏసీఎంఏ) వార్షిక సమావేశంలో ఆయన చెప్పారు.