Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ పంట పండిస్తోంది. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ మ్యానరిజాన్ని మరోసారి ఎలివేట్ చేసేలా పక్కాగా ప్లాన్ చేసినట్టు గ్లింప్స్ చెబుతోంది. సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పార్ధీబన్ (R. Parthiban) విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఏదైనా క్లారిటీ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్, పవన్ కల్యాణ్ అభిమానులు.
Ustaad Bhagat Singh
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.పవన్ కల్యాణ్ మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాతోపాటు సుజిత్ డైరెక్షన్లో ఓజీలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..