SSMB 29 | ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ‘బాహుబలి’తో ఓ కొత్త ట్రెండ్‌ను ప్రవేశపెట్టారు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఒకే కథను రెండు భాగాలుగా నిర్మించి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆయన వేసిన బాట తర్వాతి దర్శకులకు ప్రేరణగా మారింది. అప్పటి వరకు సీక్వెల్స్ చేసినా, కథను ముందుగానే ప్లాన్ చేసి రెండు పార్టులుగా తీసుకురావడం ‘బాహుబలి’ నుంచే మొదలైంది. ఆ దారిలోనే తర్వాత ‘కేజీఎఫ్’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి భారీ ప్రాజెక్టులు వచ్చాయి. త్వరలో ‘కల్కి 2898 ఏ.డి’, ‘సలార్’ లాంటి చిత్రాలు కూడా అదే ట్రాక్‌లో రాబోతున్నాయి. ఇప్పుడు రాజమౌళి కూడా మళ్లీ అదే మార్గంలో అడుగులు వేయనున్నారు అనే టాక్ వినిపిస్తుంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం “SSMB29” పేరిట పిలవబడుతుంది. ఈ మూవీ గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం గ్లోబ్ ట్రాటింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రీ లుక్ విడుదల చేశారు. నవంబర్‌లో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా కెన్యాలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. షూటింగ్ కోసం రాజమౌళి తన టీంతో కలిసి కెన్యా వెళ్లగా, అక్కడి ప్రభుత్వ ప్రతినిధులను కలిశారు. క్యాబినెట్ సెక్రటరీ స్వయంగా రాజమౌళితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, ఈ చిత్రం 120 దేశాల్లో విడుదల కానుందని వెల్లడించారు.
మరోవైపు , ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని కెన్యా మీడియా వెల్లడించింది. అంటే మరోసారి రాజమౌళి ‘బాహుబలి’ మోడల్‌ను ఫాలో అవుతున్నట్లు అర్థం అవుతుంది. కాని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఒక పార్ట్‌గానే వస్తుందని అంటున్నారు. దీనిపై రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. SSMB29లో కొంత భాగం ఆఫ్రికా నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలని కెన్యాలో చిత్రీకరించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ స్టార్ ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ, దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.