SSMB 29 | దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి భారీ ఈవెంట్ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈ రోజు (శనివారం, నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరగనుంది.ఈవెంట్ రాత్రి 7గం.లకి ప్రారంభం కానుండగా, పాస్‌పోర్ట్ హోల్డ ర్లు సాయంత్రం 5 గంటలకల్లా రామోజీ ఫిల్మ్ సిటీలోకి చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. భారీ క్రౌడ్ ఉండే అవకాశం ఉండటంతో, ముందస్తుగా చేరడం మంచిది అంటున్నారు..
ఈవెంట్ కోసం పాస్‌లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన ఎల్లో, ఆరెంజ్, పింక్ రంగుల పాస్‌పోర్ట్‌లను పంపిణీ చేశారు. ప్రతి రంగు పాస్‌పోర్ట్‌కు అనుసరించి సీటింగ్‌ను కేటాయించినట్లు సమాచారం. ఈవెంట్ జియో హాట్‌స్టార్‌లో రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హాలీవుడ్లో ప్రముఖ సంస్థ వెరైటీ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్లో లైవ్ అందించనుంది. ఈ ప్రత్యేక వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శకుడు రాజమౌళి,సినిమాలో మందాకినీ పాత్ర పోషిస్తున్న ప్రియాంక చోప్రా,సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి,సింగర్ శృతి హాసన్,కాలభైరవ హాజరు కానున్నారు.
ఈవెంట్‌కు ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. మూడు స్పెషల్ సర్ప్రైజ్లు రాజమౌళి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్, ప్రియాంక చోప్రా లుక్, ‘సంచారి సంచారి’ సాంగ్ విడుదల కాగా, ఇవి ఈవెంట్లో ప్రదర్శించబడతాయి. అదనంగా రాజమౌళి మూడు సర్ప్రైజ్లు ప్రిపేర్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. సినిమా టైటిల్ రివీల్ చేయడంతో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. మూడో సర్ప్రైజ్గా మేకింగ్ వీడియో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుక సినీ ప్రియులకి మంచి మజా అందించడం ఖాయంగా తెలుస్తుంది.