SSMB 29 | గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ప్రత్యేక వీడియో విడుదల చేసిన రాజమౌళి
SSMB 29 | ఇండియన్ సినిమా అభిమానులు, టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వస్తున్న 'గ్లోబ్ ట్రాటర్' (SSMB29) నుంచి మైండ్-బ్లోయింగ్ ఫీస్ట్ రాబోతోంది.
SSMB 29 | ఇండియన్ సినిమా అభిమానులు, టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ (SSMB29) నుంచి మైండ్-బ్లోయింగ్ ఫీస్ట్ రాబోతోంది. రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ స్పెషల్ ఈవెంట్ ఇప్పుడు నేషన్వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇది సాధారణ ప్రెస్ మీట్ కాదు, ఇండియన్ సినిమా ప్రమోషన్లలో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచే హై-ఎండ్ గ్లోబల్ ఈవెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో ‘గ్లోబ్ ట్రాటర్’కు సంబంధించిన కీ వీడియో ఫుటేజ్‌ను మెగా స్క్రీన్‌పై ప్రదర్శించబోతున్నారు అన్న వార్తతోనే హైప్ గరిష్టస్థాయికి చేరింది.
ఈ ఈవెంట్ హోస్ట్ సెలక్షన్లో కూడా రాజమౌళి తన మాస్టర్ ప్లాన్ చూపించాడు. తెలుగు మరియు హిందీ ఆడియన్స్‌ను, అలాగే ట్రెడిషనల్ & న్యూ ఏజ్ మీడియాను కవర్ చేయడానికి ఇద్దరు హోస్ట్లను ఫిక్స్ చేశారు. టాలీవుడ్లో ఎప్పటి మాదిరిగానే ఈవెంట్‌కు ఫ్యామిలీ టచ్, గ్రేస్ తీసుకురావడానికి యాంకరింగ్ క్వీన్ సుమను ఎంపిక చేశారు. తెలుగు మార్కెట్, కోర్ ఆడియన్స్‌ను కనెక్ట్ చేయడంలో ఆమెకు ఉన్న ఎఫెక్ట్‌ను రాజమౌళి బాగా ఉపయోగించుకుంటున్నాడు. మరోవైపు ఇండియాలోనే బిగ్గెస్ట్ యూట్యూబ్ స్టార్స్‌లో ఒకరు ఆశిష్ చంచ్లాని. సోషల్ మీడియా & యువతలో ఆశిష్‌కు ఉన్న పాపులారిటీ అపారంగా ఉంటుంది. నార్త్ ఇండియా & యూత్ జనరేషన్‌ను టార్గెట్ చేయడానికి ఇతను పర్ఫెక్ట్
ఈ ఈవెంట్‌ను గ్లోబల్ లెవెల్లో ‘జియోహాట్‌స్టార్’ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఆ సంస్థ భారీ మొత్తం చెల్లించినట్లు ఇండస్ట్రీ టాక్. ఇక మరో రెండు రోజులలో ఈవెంట్ జరగనుండగా, రాజమౌళి కొద్ది సేపటి క్రితం ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఈ ఈవెంట్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని, అన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నాం 2గం.ల నుండి లోపలికి అనుమతి ఉంటుందని కూడా తెలియజేశారు. మరోవైపు 18 ఏళ్ల లోపు వారికి, పెద్దలకు పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా వారు ఈవెంట్‌కి రావొద్దని తెలియజేశారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలని కూడా అస్సలు నమ్మోద్దని సూచించారు. నవంబర్ 15న జరగనున్న ఈవెంట్లో అందరం కలుద్దాం అని జకన్న వీడియోని ముగించారు.
Very excited to see you all at the #Globetrotter event on November 15.
The RFC main gate will be closed on the event day. Follow the instructions on your entry pass. Cooperate with police and security to ensure a hassle-free, safe, and happy experience for everyone. pic.twitter.com/bG3Hw5XmD8
— rajamouli ss (@ssrajamouli) November 13, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

