SSMB 29 | సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 గురించి సినీప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమాపై ఉన్న హైప్ రోజురోజుకు మరింత పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. అప్పుడప్పుడు “షూటింగ్ జరుగుతోంది” అనే చిన్న సమాచారం మాత్రమే బయటకు వస్తోంది. లీకైన కొన్ని వీడియోల్లో మహేష్ బాబు లుక్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మరోవైపు ఈ సినిమా టైటిల్ గురించి కూడా భారీ చర్చే నడుస్తోంది.
ప్రారంభంలో “గరుడ” అనే పేరుతో సినిమా వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ వార్తలు అవాస్తవం అని తేలిపోయాయి. ఆ తర్వాత “వారణాసి” అనే టైటిల్‌ను సినిమా బృందం రిజిస్టర్ చేసుకుందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఫ్యాన్స్ వారణాసి టైటిల్ పోస్టర్స్, ఫ్యాన్ మేడ్ వీడియోలతో సోషల్ మీడియాలో హంగామా చేశారు.ఇక రీసెంట్గా మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాంతో ఈరోజు ఎట్టకేలకు SSMB29 టైటిల్ రివీల్ అవుతుందనే అంచనాలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర టైటిల్ రివీల్‌ను నవంబర్ 15న జరగనున్న “గ్లోబ్ ట్రోటర్” ఈవెంట్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది.
అయితే ఇంతవరకు “వారణాసి” టైటిల్‌నే అనుకున్న అభిమానులకు ఇప్పుడు షాక్ తగిలింది. తాజాగా చిన్న తెలుగు సినిమా “వారణాసి” అనే పేరుతో టైటిల్ పోస్టర్ విడుదల చేసింది. దీంతో మహేష్ బాబు – రాజమౌళి సినిమా టైటిల్ “వారణాసి” కాదని స్పష్టమైంది. ఈ విషయంతో మహేష్ అభిమానులు కొంత రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 15న జరగనున్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌పై నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ మేగా యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు రాజమౌళి ఏ టైటిల్‌ను ఎంచుకుంటారన్నదే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. మహేష్ బాబు కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవబోతున్న SSMB29 టైటిల్ రివీల్‌పై ప్రేక్షకులు, అభిమానులు, సినీ వర్గాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.