Oscar Awards | ఆస్కార్ కమిటీలో రాజమౌళి దంపతులు
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్'తో తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారాయన. దర్శకుడిగా రాజమౌళి సాధించిన ఘనత అసామాన్యం.
Oscar Awards | తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారాయన. దర్శకుడిగా రాజమౌళి సాధించిన ఘనత అసామాన్యం. ఇప్పుడు ఆయనతోపాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా ఓ ఘనతను సాధించారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఈ జంటకు ఆహ్వానం అందింది.
దర్శకుల కేటగిరిలో రాజమౌళి, కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా రమా రాజమౌళి ఈ గౌరవం దక్కించుకున్నారు. ఈ ఏడాది 57 దేశాలనుంచి 487మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానాలు పంపగా, మన దేశం నుంచి ఈ జంటతో పాటు షబానా ఆజ్మి, రితేశ్ సిద్వానీ, రవివర్మన్ తదితరులు ఈ అహ్వానం అందుకున్నవారిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆస్కార్ అకాడమి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన కళాకారులకు ఆహ్వానం పలకడం పట్ల అకాడమి ఆనందం వెలిబుచ్చింది. ఇప్పటికే ఈ గౌరవాన్ని దక్కించుకున్నవారిలో తారక్, రామ్‌చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, చాయాగ్రహకుడు సెంథిల్‌కుమార్ ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

