Ram Charan and Jr NTR | దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR)చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా లేదా అని అభిమానులు ఎదురుచూస్తుండగా.. దీనికి సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక ప్రదర్శన జరుగగా.. ఈ వేడుకలో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ ఉంటుందా అని అడుగగా.. దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.
రాజమౌళి గారు ఇప్పుడు మీరు ‘ఆర్ఆర్ఆర్ 2’ చేస్తారా? అని ఉపాసన అడుగగా.. రాజమౌళి “తప్పకుండా చేస్తాం” అని బదులిచ్చారు. దాంతో వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యు అని స్పందించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్ 2’ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో అనే చర్చ మొదలైంది. మరోవైపు రాజమౌళి సమాధానంతో ఆడిటోరియంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ కూడా చిరునవ్వుతో కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే, ‘ఆర్ఆర్ఆర్ 2’ ఎప్పుడు ప్రారంభమవుతుంది, దాని కథాంశం ఎలా ఉండబోతుందనే వివరాలను రాజమౌళి వెల్లడించలేదు. కానీ, సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఆయన చెప్పడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు అంతర్జాతీయంగా ఉన్న సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్ 2’ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
#RRR2 confirmed!#Londondiaries: #RamCharan, #JrNTR, and #Rajamouli share laughs as RRR 2 gets a go-ahead. pic.twitter.com/xSjSn2DKjs
— Hyderabad Times (@HydTimes) May 15, 2025