SSMB 29 | మహేష్‌బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్ అడ్వెంచర్ కథాంశంతో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా..హాలీవుడ్ సాంకేతిక నిపుణులను భాగస్వామ్యం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ కథనందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది.