రాజమౌళి సినిమా అంటేనే భారీతనానికి చిరునామా. గ్రాండ్ విజువల్స్..అందుకోసం రూపొందించే సెట్స్ విషయంలో ఆయనెప్పుడూ కాంప్రమైజ్ కారు. తాజా సమాచారం ప్రకారం మహేష్‌బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం భారీ స్థాయిలో సెట్స్‌ను తీర్చిదిద్దుతున్నారట.
ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల్లో వెండితెరపై సరికొత్త ప్రపంచాల్ని ఆవిష్కరించిన రాజమౌళి తన తాజా సినిమా కోసం దేశంలోనే అత్యంత ఖరీదైన సెట్స్‌ను వేయిస్తున్నట్లు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..రాజమౌళి, మహేష్‌బాబు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నది.
ఈ నేపథ్యంలో దాదాపు 50కోట్ల భారీ వ్యయంతో వారణాసి సెట్‌కు రూపకల్పన చేస్తున్నారని తెలిసింది. ఇక్కడ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను తెరకెక్కిస్తారని సమాచారం. యస్యస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కె.ఎల్.నారాయణ నిర్మాత.