OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ (OG). సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ మొదలైంది. పవన్ కల్యాణ్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యూల్లో మాస్, ఎనర్జిటిక్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నట్టు సమాచారం. కాగా ఓజీ టీంలో మరో క్రేజీ యాక్టర్ జాయిన్ అయింది. చెన్నై భామ శ్రియా రెడ్డి (Sriya Reddy) ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. శ్రియారెడ్డికి స్వాగతం.. మీ ఎంట్రీ షాకింగ్‌గా ఉండబోతుంది అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగులో అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది సినిమాల్లో నటించింది శ్రియా రెడ్డి. విశాల్‌తో కలిసి పొగరు చిత్రంలో నటించింది. ఇప్పటివరకు పవర్ ఫుల్ క్యారెక్టర్లలో కనిపించిన శ్రియారెడ్డిని.. ఓజీలో సుజిత్ ఎలా చూపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. శ్రియారెడ్డి మరోవైపు ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఓజీలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే ఓజీ ముంబై, పూణే షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
Welcome aboard, @SriyaReddy!
Your presence in #OG will be a shocker and a banger. 🤙🏻 #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/YMQwjsSk59
— DVV Entertainment (@DVVMovies) June 13, 2023
#OG #FireStormIsComing #TheyCallHimOG @DVVMovies @dop007 @prakashraaj @PawanKalyan @sujeethsign pic.twitter.com/RfbKwkZ3VB
— Sriya Reddy (@sriyareddy) June 13, 2023